అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-01-29T06:26:18+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) అధ్యక్ష పీఠంపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. కాంబ్లె నాందేవ్‌ మృతితో ఖాళీ ఏర్పడిన డీసీసీబీ చైర్మన్‌ స్థానానికి శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఎస్సీ రిజర్వ్‌డు డైరెక్టర్‌ స్థానం శుక్రవారం ఏకగ్రీవం కావడంతో ఇక చైర్మన్‌ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. దీంతో ఏ-క్లాసు డైరెక్టర్లు 16 మంది,

అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ
జిల్లాకేంద్రంలోని డీసీసీబీ కార్యాలయం

నేడు డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక

20మంది డైరెక్టర్లకు సమాచారం ఇస్తూ నోటీసుల జారీ

ఏకగ్రీవమైన ఎస్సీ రిజర్వ్‌డు డైరెక్టర్‌ స్థానం

అధిష్ఠానం పంపించే షీల్డ్‌ కవర్‌పై సర్వత్రా ఆసక్తి

డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం!

ఆదిలాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) అధ్యక్ష పీఠంపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. కాంబ్లె నాందేవ్‌ మృతితో ఖాళీ ఏర్పడిన డీసీసీబీ చైర్మన్‌ స్థానానికి శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఎస్సీ రిజర్వ్‌డు డైరెక్టర్‌ స్థానం శుక్రవారం ఏకగ్రీవం కావడంతో ఇక చైర్మన్‌ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. దీంతో ఏ-క్లాసు డైరెక్టర్లు 16 మంది, బి-క్లాస్‌ డైరెక్టర్లు నలుగురు మొత్తం 20మంది డైరెక్టర్లు ఈ చైర్మన్‌ ఎన్నికల్లో పాల్గొననున్నారు. వీరందరికీ చైర్మన్‌ ఎన్నికపై సమాచారం ఇస్తూ నోటీసులు జారీ చేశారు. డైరెక్టర్లందరినీ క్యాంపునకు తరలించాలని భావించినప్పటికీ.. అధిష్ఠానం సూచించిన వారే చైర్మన్‌ అయ్యే అవకాశం ఉండడంతో అందుబాటులో ఉండాలని నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌లలోని ఉమ్మడి జిల్లా డైరెక్టర్లు అందరికీ సమాచారం అందిస్తూ నోటీసులను జారీ చేశారు. ఇప్పటికే కొందరు డైరెక్టర్లు రహస్యంగా సమావేశమై చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారిని కొంత డిమాండ్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన ట్లు తెలుస్తుంది. అయితే చైర్మన్‌ పదవికి అధిష్ఠానం సూచించిన వారే నామినేషన్‌ వేసే అవకాశం ఉండడంతో డబ్బు రాజకీయాలకు అవకాశమే లేకుండా పోయింది. డైరెక్టర్‌ స్థానం ఎన్నికకు నిర్మల్‌, ఆది లాబాద్‌ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు తరలి వచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు డీసీసీబీ ఇన్‌చార్జి చైర్మ న్‌ రఘునందన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, బాలూరి గోవర్ధన్‌రెడ్డితో పాటు నిర్మల్‌, జైనథ్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడు కొరిపెల్లి రాము, గోవర్ధన్‌, సింగిల్‌ విండో డైరెక్టర్లు మాణిక్‌రెడ్డి, నర్సారెడ్డి, తదితరులు హాజరయ్యారు.

నిర్మల్‌ జిల్లాకే డైరెక్టర్‌

కాంబ్లె నాందేవ్‌ మరణంతో ఖాళీ గా ఏర్పడిన ఎస్సీ రిజర్వ్‌డు డైరెక్టర్‌ స్థానానికి ఎన్నికలు నిర్వహించ గా.. నిర్మల్‌కు చెందిన నేతకే డైరెక్టర్‌ పదవి దక్కింది. ప్రస్తుతం మూఠాపూర్‌ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న కోట చిన్న గంగాధర్‌ డైరెక్టర్‌ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందారు. నామినేషన్‌ గడువు ముగిసే వరకు ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించా రు. నిర్మల్‌ రూరల్‌ మండలం అనంతపేట గ్రామానికి చెందిన గంగాధర్‌ మొ దటి నుంచి మంత్రి అల్లోల అనుచరుడిగా అధికార పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇంద్రవెల్లి మండలానికి చెందిన పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక చొరవ తీసుకుని సముదాయించడంతో నామినేషన్‌ వేయకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. దీంతో కోట చిన్నగంగాధర్‌ ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది.

చైర్మన్‌ రేసులో పలువురు?

డీసీసీబీ చైర్మన్‌ అభ్యర్థిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం షీల్డ్‌కవర్‌ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఎవరిపేరు ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారిలో రఘునందన్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, బాలూరి గోవర్ధన్‌రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. మంత్రి అల్లోల నిర్మల్‌ జిల్లాకు చెదిన రఘునందన్‌రెడ్డికి మద్దతునిచ్చినా.. చివరి సమయంలో మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో అడ్డి భోజారెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు  పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావులతో పాటు మిగతా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు కూడా భోజారెడ్డి పేరును అధిష్ఠానం పెద్దలకు సూచించడంతో దాదాపుగా ఆయనే చైర్మన్‌ అభ్యర్థిగా ఖరారైనట్లు తెలుస్తుంది. మొదట ఆదిలాబాద్‌ జిల్లాకే డీసీసీబీ చైర్మన్‌ పదవిని కేటాయించడం కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. బాలూరి గోవర్ధన్‌రెడ్డి కూడా చైర్మన్‌ పదవి కోసం ఇన్నాళ్లు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. ఆయన కూడా పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. అయినా చివరి వరకు ఏం జరుగుతుందో?నన్న ఉత్కంఠ నెలకొంది.

కోరం ఉంటేనే చైర్మన్‌ ఎన్నిక

సరిపడా కోరం ఉంటేనే చైర్మన్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 20మంది డైరెక్టర్లలో.. 11మంది హాజరు కావాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా డైరెక్టర్లు సమావేశానికి హాజరుకాకుంటే వాయిదా పడే అవ కాశం ఉంది. తదుపరి ఎన్నిక తేదీని ఖరారు చేసి కోరం ఉన్నా, లేకపోయినా చైర్మన్‌ ఎన్నికను చేపట్టనున్నారు. శనివారం ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు చైర్మన్‌ అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరిస్తారు. 11.30 గం టల నుంచి 12గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణ, 2.30 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఎన్నిక అనివార్యమైతే మధ్యాహ్నం 3గంటల నుంచి 5గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఒకవేళ నామినేషన్ల గడువు సమయం ముగిసే వరకు ఒకే అభ్యర్థి నామినేషన్‌ వేస్తే చైర్మన్‌ ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. దాదాపు   ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

పార్టీ నమ్మకాన్ని నిలబెడతా..

: కోట చిన్నగంగాధర్‌, డీసీసీబీ డైరెక్టర్‌

తనపై నమ్మకం ఉంచి డైరెక్టర్‌గా అవకాశం కల్పించినందుకు పార్టీ నమ్మకాన్ని నిలబెడతా. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నల సహకారంతోనే డైరెక్టర్‌ పదవి దక్కింది. డీసీసీబీ మెరుగైన పాలనలో నా వంతు సహకారం ఉంటుంది. ఎస్సీ రిజర్వ్‌డు స్థానంలో డైరెక్టర్‌ పదవిని దక్కించుకోవడం సంతోషంగా ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే దళితులకు పార్టీ పరమైన పదవులు దక్కుతాయి. అన్ని రంగాల్లో దళితుల అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైంది.

Updated Date - 2022-01-29T06:26:18+05:30 IST