ఉత్సాహంగా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-14T04:03:54+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్స వాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిం చగా వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఊరు, వాడల్లో జాతీయ జెండాలతో ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

ఉత్సాహంగా వజ్రోత్సవాలు
ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, డీసీపీ, డీఎఫ్‌వో, ఎమ్మెల్యే

హర్‌ ఘర్‌ తిరంగ్‌ పేరుతో వేడుకలు  

ఊరూరా పండుగ వాతావరణం 

ఇంటింటా ఎగురుతున్న జాతీయ జెండాలు  

ర్యాలీలు, ప్రదర్శనలతో  ప్రజాప్రతినిధులు బిజీబిజీ 

మంచిర్యాల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్స వాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిం చగా వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఊరు, వాడల్లో జాతీయ జెండాలతో ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పల్లెలు, పట్టణా ల్లోని ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. సుమా రు 60 నుంచి 70 వేల జెండాలను మున్సిపాలిటీలు, పంచాయతీల కూడళ్ల వద్ద ఏర్పాటు చేయనున్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా పలు చోట్ల అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 

ఇంటింటా జెండాల పంపిణీ

హర్‌ ఘర్‌ తిరంగ్‌ పేరుతో జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెం డాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే వాడలు, గ్రామాల్లో జాతీయ జెం డాల పంపిణీ చేపట్టగా దాదాపుగా అన్ని ఇండ్లపై పతాకాలు రెపరెపలా డుతున్నాయి. 13,14,15 తేదీల్లో మూడు రోజులపాటు ప్రతీ ఇంటిపై నిబంధనలు పాటిస్తూ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల  21 వరకు అన్ని వర్గాల ప్రజల్లో దేశ భక్తిని మరింత పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. హర్‌ ఘర్‌ తిరంగ్‌లో భాగంగా జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 86 వేల పైచిలుకు జెండాలు పంపిణీ చేస్తున్నారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మున్సిపాలిటీల్లో జనాభా ప్రకారం జెండాల పంపిణీ జరుగుతోంది. ఇప్పటి వరకు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 21 వేలు, బెల్లంపల్లిలో  13 వేలు, మందమర్రిలో  12 వేలు, క్యాతన్‌పల్లిలో  8 వేలు, లక్షెట్టిపేటలో  5 వేలు, నస్పూర్‌లో 18 వేలు, చెన్నూర్‌లో 6 వేల చొప్పున జాతీయ జెండా లను ఇంటింటికీ పంపిణీ చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతుండగా పాఠశాల విద్యార్థులకు థియేటర్‌లలో ఉచితంగా గాంధీ సినిమాను చూపిస్తున్నారు. 

రాజకీయ పార్టీల నేతలు బీజీ......

75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత వేడుకల్లో భాగంగా ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు వజ్రోత్సవాల్లో పాల్గొంటున్నాయి.  ఆయా పార్టీల ఆధ్వర్యంలోనూ ఇంటింటికి జాతీయ పతాకాలను పంపిణీ చేస్తు న్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు నిర్వ హిస్తుండగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కే ఫ్రీడం రన్‌, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాల్లో బీజేపీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. శనివారం పోలీసు శాఖ, టీఆర్‌ఎస్‌, మున్సిపల్‌ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నారు. 

పల్లెల్లో పండుగ వాతావరణం 

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించ నున్నారు. ఈ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభం కావడంతో పల్లెల్లో, వాడ వాడలా జాతీయ జెండాల ప్రదర్శన కొనసాగుతోంది. గ్రామాల్లో జాతీయ జెండాల ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాల్లో పార్టీలకతీ తంగా ర్యాలీలు నిర్వహిస్తుండగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.  జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 50 వేల జెండాలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు  90 శాతం ఇండ్లకు జాతీయ జెండాలు చేరా యి. హరితహారంలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. యువత వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ డీపీల్లో జాతీయ జెండా ఫొటోలను పెట్టుకుంటూ జాతీయతను చాటుతున్నారు. 

Updated Date - 2022-08-14T04:03:54+05:30 IST