ఉప్పొంగిన దేశభక్తి..

ABN , First Publish Date - 2022-08-17T05:15:34+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం సంగారెడ్డిలో సామూహిక గీతాలాపన చేశారు.

ఉప్పొంగిన దేశభక్తి..
చిన్నశంకరంపేటలో జాతీయ గీతాలాపన చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో సామూహిక జాతీయ గీతాలాపన

పాల్గొన్న అధికారులు, నాయకులు, ప్రజలు

వాడవాడలా మార్మోగిన జాతీయగీతం

 

 సంగారెడ్డిటౌన్‌/మెదక్‌అర్బన్‌, ఆగస్టు16: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం సంగారెడ్డిలో సామూహిక గీతాలాపన చేశారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపనలో ఎక్కడి వారు అక్కడే నిలుచుని గౌరవ వందనం చేశారు. పట్టణంలోని పోతిరెడ్డిపల్లిచౌరస్తా, ఐబీ వద్ద, పాత బస్టాండ్‌ వద్ద వందలాది మంది విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మానవహారంగా నిల్చుని జాతీయ గీతాలాపన చేశారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిర్వహించిన సామూహిక గీతాలాపనలో జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీ, కలెక్టర్‌ శరత్‌, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్‌, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌తో పాటు సంగారెడ్డి రూరల్‌ పోలీసులు పాల్గొని గౌరవ వందనం చేశారు. ఐబీ వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మిరవి, సీఐ రమేశ్‌, కౌన్సిలర్లు ఆశ్విన్‌, విష్ణు, మాజీ కౌన్లిసర్లు ప్రదీ్‌పకుమార్‌ తదితరులు పాల్గొని జాతీయ గీతాలాపన చేశారు. అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులు, సిబ్బంది జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. సామూహిక గీతాలాపన కోసం పట్టణంలో ఆయా విద్యాసంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు జాతీయ పతాకాలను చేతబూని రోడ్లపైకి వచ్చి మానవహారం నిర్వహించారు. పట్టణంలోని చౌరస్తాల వద్ద 11.30 గంటల నుంచి 58 సెకన్ల పాటు రెడ్‌సిగ్నల్స్‌ వేయడంతో ఎక్కడి వాహనాలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీ, కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ జాతీయ సమైఖ్యత, దేశాభిమానం పెంపొందించేలా జిల్లాలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. స్వతంత్ర భారతంలో అన్ని జాతులు, కులాలు, మతాలు ఉన్నాయని సర్వమత సమానంతో మెలిగేలా ఐక్యతను చాటాలన్నారు. నేటి యువత మహానీయులను ఆదర్శంగా తీసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ వజ్రోత్సవ వేడుకలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.


 అమరుల స్ఫూర్తితో యువత విజయాలు సాధించాలి

మెదక్‌అర్బన్‌, ఆగస్టు16: అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించాలని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ ఆధ్వర్యంలో ఉదయం 11:30 గంటలకు చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపనలో అదనపు కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. నేటి తరానికి స్వాతంత్య్ర ఉద్యమం గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ మాట్లాడుతూ..భారతదేశ అభ్యున్నతిలో భాగస్వాములమవుతామన్నారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ యేసయ్య మాట్లాడుతూ..దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది పోరాడి ప్రాణాలర్పించారని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో ఐడీసీఈఈ కీమా నాయక్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి,  టీఎన్జీవోలు, రాజ్‌కుమార్‌, మనోహర్‌, ఫజల్‌, ఇక్బాల్‌, రఘునాఽథ్‌, శివాజీ, రామాగౌడ్‌, అనురాఽధ తదితరులు పాల్గొన్నారు.


కలెక్టరేట్‌లో

వజ్రోత్సవాల్లో భాగంగా ప్రఽభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ఉదయం 11:30 గంటలకు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతంగా జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, వివిధ శాఖ జిల్లా అధికారులు గౌరవ వందనం చేశారు.


మండల పరిధిలో

75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని మంబోజిపల్లి చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మెదక్‌ ఆర్డీవో సాయిరాం, ఎంపీపీ యమునా, రూరల్‌ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.


మెదక్‌ కలెక్టరేట్‌లో ఘనంగా   కవి సమ్మేళనం

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం  కలెక్టరేట్‌లో కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. పలువురు కవులు పాల్గొని వారి కవితలు వినిపించారు. జానపద కళాకారులు, చిన్నారుల శాస్ర్తీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అనంతరం కవి సమ్మేళనంలో, నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కవులు, కళాకారులను ప్రభుత్వం అన్ని రకాలుగా అదుకుంటోందన్నారు. కవులను ప్రోత్సహిస్తూ.. వారిని గౌరవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌కుమార్‌, డీఎ్‌సవో శ్రీనివాస్‌, ఇరిగేషన్‌ ఈఈ శ్రీనివా్‌సరావు, డీఈవో రమేశ్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, డీవైఎ్‌సవో నాగరాజు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-17T05:15:34+05:30 IST