కల్తీ కల్లుకు కట్టడేది?

ABN , First Publish Date - 2020-04-09T10:10:20+05:30 IST

తాండూరు మండల పరిధిలోని నారాయణపూర్‌, మల్కాపూర్‌, సంగెంకలాన్‌, అంతారం, ఉద్దండాపూర్‌, జినుగుర్తి, బెల్కటూర్‌ తదితర గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా

కల్తీ కల్లుకు కట్టడేది?

గ్రామాల్లో యధేచ్ఛగా విక్రయాలు 

పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు


తాండూరు రూరల్‌ : తాండూరు మండల పరిధిలోని నారాయణపూర్‌, మల్కాపూర్‌, సంగెంకలాన్‌, అంతారం, ఉద్దండాపూర్‌, జినుగుర్తి, బెల్కటూర్‌ తదితర గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. సరిహద్దు గ్రామాల శివారులో కొందరు యధేచ్ఛగా విక్రయాలు చేపడుతున్నారు. నారాయణపూర్‌ గ్రామంలో తెల్లవారుజాము నుంచే కల్లు విక్రయిస్తున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైన్స్‌ షాపుల బంద్‌ అయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల  ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-04-09T10:10:20+05:30 IST