సర్వాయిపేటలో అర్ధరాత్రి ఎక్సైజ్ అధికారి హల్‌చల్

ABN , First Publish Date - 2020-04-03T14:43:12+05:30 IST

మంచిర్యాల: కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలో అర్ధరాత్రి ఎక్సైజ్ అధికారి ఒకరు హల్‌చల్ చేశారు.

సర్వాయిపేటలో అర్ధరాత్రి ఎక్సైజ్ అధికారి హల్‌చల్

మంచిర్యాల: కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలో అర్ధరాత్రి ఎక్సైజ్ అధికారి ఒకరు హల్‌చల్ చేశారు. నాటు సారా నిరోధం పేరిట మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఇళ్లలోకి వెళ్లారు. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ స్థానికులతో వాగ్వాదానికి దిగారు. నిద్రపోతున్న వారిని లేపి అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


తాను ఎక్సైజ్ సీఐనని, ఎప్పుడైనా వస్తానని చెబుతున్నారని వాపోయారు. సదరు వ్యక్తిని ఐడీ కార్డ్ చూపెట్టమని గ్రామస్తులు నిలదీశారు. అయితే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో స్నేహితులతో కలిసి అక్కడ నుంచి అధికారి జారుకున్నట్టు తెలుస్తోంది. సదరు అధికారినంటూ తమ గ్రామానికి వచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Updated Date - 2020-04-03T14:43:12+05:30 IST