వర్షాలతో పంటలకు అపార నష్టం

ABN , First Publish Date - 2020-10-12T09:19:35+05:30 IST

యాచారం మండలంలో గత కొన్ని రోజులు గా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా టమాట రైతు లు తీవ్రంగా నష్టపోయారు.

వర్షాలతో పంటలకు అపార నష్టం

వంద ఎకరాల్లో దెబ్బతిన్న టమాట పంట

పెట్టుబడి సైతం మునిగామని రైతుల ఆవేదన

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


యాచారం: యాచారం మండలంలో గత కొన్ని రోజులు గా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా టమాట రైతు లు తీవ్రంగా నష్టపోయారు. మం డలంలోని వివిధ గ్రామాల్లో 350 హెక్టార్లలో కూరగాయ తోటలు సాగు చేయగా వాటిల్లో వంద ఎకరాల్లో టమాట వేశారని మం డల వ్యవసాయ శాఖ అధికారు లు తెలిపారు. కాగా కుర్మిద్ద, మం గళిగడ్డ తండా, మర్లకుంట తం డా, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, తమ్మ లోని గూడ, గడ్డమల్లాయ గూడ, చిన్న తూండ్ల గ్రామాల్లో టమాట తోటలు పూర్తిగా పాడై పోవడంతో రైతులు పాలుపోని స్థితిలో ఉన్నారు. మంగళి గడ్డతండాకు చెందిన 30 మంది రైతులు విస్తారంగా టమాట తోటలు సాగుచేయగా 90శాతం మేర తోటలు పూర్తిగా కుళ్లిపోయి అప్పులే మిగిలాయని గిరిజనులు కన్నీటిపర్యంతమయ్యారు.


తాడిపర్తికి చెందిన యాదయ్య, మల్లేష్‌ తది తర రైతులకు చెందిన టమాట తోటలు పాడైపోవడంతో పంట కోసం చేసిన అప్పు లు ఎలా తీర్చాలో తోచడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి కనీసం 12వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయని, త మ రెక్కల కష్టం దీనికి అదనం అని తెలిపా రు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-12T09:19:35+05:30 IST