నాగులకుంటలో సుందరీకరణ పనులు చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

ABN , First Publish Date - 2022-01-22T06:21:05+05:30 IST

చౌటుప్పల్‌ పట్టణంలోని నాగులకుంట సుందరీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

నాగులకుంటలో సుందరీకరణ పనులు చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

 నాగులకుంట సుందరీకరణ పనులు ప్రారంభం

చౌటుప్పల్‌ టౌన, జనవరి 21: చౌటుప్పల్‌ పట్టణంలోని నాగులకుంట సుందరీకరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.  సీఎస్సార్‌ ఫండ్‌ కింద దివీస్‌ పరిశ్రమ కేటాయించిన రూ.1.20 కోట్లతో చేపట్టిన సందరీకరణ ఈ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మురుగు నీటితో తీవ్రమైన దుర్గందాన్ని వెదజల్లుతున్న నాగులకుంటను సుందరీకరణ చేసి మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చుతామన్న మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు తన ఎన్నికల వాగ్ధానం మేరకు ఈ పనులకు బీజం పడింది.  ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్మన రాజు మాట్లాడుతూ ప్రజలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో నాగులకుంటను సందరీకరణ చేసి మినీ ట్యాంక్‌బండ్‌ గా మార్చుతున్నామని తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు  ఇది ఒక వరంగా మారనుందన్నారు. దివీస్‌ సంస్థ కేటాయించిన రూ.1.20 కోట్లు సరిపడని పక్షంలో మరిన్ని నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సుందరీకరణ  పనులను త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాగస్వాములు కావాలని కోరారు. ఇదిలా ఉండగా మునిసిపల్‌ కౌన్సిల్‌కు సమాచారం లేకుండా రూ.1.20 కోట్లతో  నాగులకుంట సుందరీకరణ పనులను ఏకపక్షంగా  చేపట్టడం సరైన విధానం కాదని బీజేపీ కౌన్సిలర్లు పి.శ్రీధర్‌బాబు, బండమీది మల్లేశం, ఆలె నాగరాజు అన్నారు. ఈ మేరకు మునిసిపల్‌ కమీషనర్‌ నర్సింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. దివీస్‌ సంస్థ కేటాయించిన ఈ నిధులతో ఊర చెరువు అలుగు సమస్యను పరిష్కరించడం శ్రేయష్కరమని పేర్కొన్నారు.


Updated Date - 2022-01-22T06:21:05+05:30 IST