అసైన్డ్ భూముల్లో విచ్చలవిడిగా తవ్వకాలు

ABN , First Publish Date - 2020-08-02T20:45:39+05:30 IST

మైనింగ్ మాఫియా మళ్లి రెచ్చిపోతోంది. పేదల భూములపై గద్దల్లా వాలుతోంది.

అసైన్డ్ భూముల్లో విచ్చలవిడిగా తవ్వకాలు

సంగారెడ్డి జిల్లా: మైనింగ్ మాఫియా మళ్లి రెచ్చిపోతోంది. పేదల భూములపై గద్దల్లా వాలుతోంది. అసైన్డ్ భూములను విచ్చలవిడిగా తవ్వేసి లక్షల్లో సంపాదిస్తోంది. కరోనా సీజన్ కావడంతో సంబంధిత అధికారులు అటువైపు చూడడంలేదు. ఇదే అదనుగా అక్రమాక్కుల పంట పండుతోంది. సంగారెడ్డి జిల్లాలో అక్రమార్కుల భూబాగోతంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


జహీరాబాద్ నియోజకవర్గంలో భూములన్నీ ఎర్రనేలలే ఎక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా ఇటుక బదులు ఎర్రరాయిని వాడతారు. మామూలుగా భూమిని తవ్వితే మట్టి, మొరం వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో మాత్రం గట్టి రాళ్లమాదిరిగా వస్తాయి. ఒక్కో రాయి ఐదు కిలోల బరువు ఉంటుంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఎర్రరాయిని ఇటుకల సైజులో పగులగొట్టి నిర్మాణాలకు వాడుతుంటారు. ఎవరికి అవసరమైతే వాళ్లు తవ్వుకుంటారు. అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ 20 ఏళ్లుగా కొన్ని మైనింగ్ మాఫియా ముఠాలు రెచ్చిపోయి భూములను తవ్వేస్తున్నారు.

Updated Date - 2020-08-02T20:45:39+05:30 IST