తిరుపతి: టిప్పు సుల్తాన్ మేనమామ మీర్ రజా అలీఖాన్ సమాధి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం సుమారు 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. రాత్రి వేళల్లో గుప్తనిధుల కోసం కోట లోపల తవ్వకాలు జరిపి ఉండవచ్చునని మసీదు పెద్దలు అనుమానిస్తున్నారు. గుర్రంకొండ పోలీసులకు మత పెద్దలు ఫిర్యాదు చేసారు. ఈ ఘటర చిత్తూర్ జిల్లాలోని గుర్రంకొండ కోటలో జరిగింది.