ఎస్సీఈఆర్టీ ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు : డీఈఓ

ABN , First Publish Date - 2021-10-20T05:19:23+05:30 IST

జిల్లాలోని అన్ని యాజమాన్యాలలోని ప్రాఽథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఫార్మెట్‌-1 పరీక్షలను రాష్ట్ర స్థాయిలో ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నాపత్రాలతో 1-10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టైం టేబుల్‌ ప్రకారం పరీక్షలను నిర్వహించాలని డీఈవో శైలజ తెలిపారు.

ఎస్సీఈఆర్టీ  ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు : డీఈఓ

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 19: జిల్లాలోని అన్ని యాజమాన్యాలలోని ప్రాఽథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఫార్మెట్‌-1 పరీక్షలను రాష్ట్ర స్థాయిలో ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నాపత్రాలతో 1-10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టైం టేబుల్‌ ప్రకారం పరీక్షలను నిర్వహించాలని డీఈవో శైలజ తెలిపారు. ప్రశ్నాపత్రాలను ప్రతి రోజు పరీక్షకు ముందుగా మండల విద్యాశాఖ అధికారులకు పం పి స్తామని, వారి వారి మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయులకు వాట్సాప్‌ ద్వారా పరీక్షకు ఒక గంట ముందు పంపించాలని చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని బల్లమీద రాయాలని తెలిపారు. జవాబు ప త్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసిన తరువాత ప్రఽధానోపాధ్యాయులు వా టిని పరిశీలించి, భద్రపరచాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటింటాలన్నారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు వారి సబ్జెక్టులలో రెమిడియల్‌ తరగతులు నిర్వహించి, విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులను అందజేయాలన్నారు. మార్కులను సెంట్రల్‌ మార్స్క్‌ రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాత అంతర్జాలంలో నమోదు చేయాలని చెప్పారు. 

Updated Date - 2021-10-20T05:19:23+05:30 IST