Abn logo
Oct 23 2021 @ 00:42AM

రీసర్వే రికార్డులను పరిశీలించిన జేసీ

బత్తలపల్లి, అక్టోబరు 22: మం డలంలోని చెన్నరాయునిపట్నం గ్రా మం లో జరు గుతున్న భూముల రీసర్వే  రికా ర్డులను తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్ర వారం జాయింట్‌ కలెక్టర్‌ నిషాంత్‌కు మా ర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా చెన్న రాయుని పట్నం గ్రామంలోని జరిగే రీ సర్వేపై ఆరా తీశారు. భూములు కొలతలు వేసిన తర్వాత హద్దులు నాటే పనిని ఉపాధి హామీ ద్వారా చేపడుతున్నారా లేదా అని అడిగారు. రీసర్వే చేసిన గ్రామ పటాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్‌, తహసీల్దార్‌ ఖుప్రా, డీఏ నాగప్ప, ఆర్‌ఐ చక్రపాణి పాల్గొన్నారు.