ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణను పరిశీలించండి

ABN , First Publish Date - 2020-09-29T06:29:39+05:30 IST

ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర మునిసిపాలిటీల్లో అసైన్డ్‌తో పాటు ఇతర ప్రభుత్వ

ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణను పరిశీలించండి

పురపాలక మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి జిల్లా ఎమ్యెల్యేల విజ్ఞప్తి

హైదరాబాదులో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడతో సమావేశం


ఖమ్మం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర మునిసిపాలిటీల్లో అసైన్డ్‌తో పాటు ఇతర ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉన్న వారికి క్రమబద్ధీకరణ చేసే విషయాన్ని పరిశీలించాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కొత్తగూడెం, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, లావుడ్యా రాములునాయక్‌, బానోతు హరిప్రియ.. కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ నియోజకవర్గాల్లోని పలు సమస్యలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మునిసిపల్‌ పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్లు నిర్మించుకుని ఉంటే ఆ ఇళ్లను క్రమబద్ధీకరించాలని, ఇంటినెంబరు, విద్యుత్‌ మీటరు, నీటితీరువా లాంటి ఆధారాలతో క్రమబద్ధీకరణ చేయాలని సూచించారు. దీనికి మంత్రి కేటీఆర్‌ మంత్రి మండలిలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 

Updated Date - 2020-09-29T06:29:39+05:30 IST