పలు విశ్వవిద్యాలయాల పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2022-01-18T17:14:15+05:30 IST

ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా వర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

పలు విశ్వవిద్యాలయాల పరీక్షలు వాయిదా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా వర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.


సెలవుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రస్మా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ట్రస్మా ప్రతినిధులు అనిల్‌ కుమార్‌, కేవీబీ కృష్ణారావు, తదితరులు సోమవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుసుకుని వినతి పత్రం అందజేశారు. విద్యా సంస్థలను వెంటనే పున:ప్రారంభించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌ రెడ్డి కూడా డిమాండ్‌ చేశారు.317 జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే సర్కారు సెలవులు ప్రకటించిందని పీడీఎ్‌సయూ ఆరోపించింది. విద్యా సంస్థలను ప్రారంభించాలని ఎస్‌ఎ్‌ఫఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి కోరారు. 

Updated Date - 2022-01-18T17:14:15+05:30 IST