తిరుపతిలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై పరిశీలన

ABN , First Publish Date - 2021-06-19T06:19:02+05:30 IST

తిరుపతి నగరంలో ఆఽధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు నగరపాలక కమిషనర్‌ గిరీష వెల్లడించారు.

తిరుపతిలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై పరిశీలన
ముంబై ప్రతినిధులతో సమావేశమైన మేయర్‌, కమిషనర్‌, కార్పొరేటర్లు, అధికారులు

నగరపాలక కమిషనర్‌ గిరీష వెల్లడి


తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 18: తిరుపతి నగరంలో ఆఽధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు నగరపాలక కమిషనర్‌ గిరీష వెల్లడించారు. ఇందులో భాగంగా ముంబై నగరంలో అమలవుతున్న డ్రైనేజీ వ్యవస్థ తరహాలో తిరుపతిలోనూ ఏర్పాటుపై చర్చించారు. ఈ నేపథ్యంలో ముంబై నుంచి వచ్చిన ఆధునిక డ్రైనేజీ విభాగ పరిశీలకులతో కమిషనర్‌తోపాటు మేయర్‌ శిరీష, పట్టణ ప్రణాళికశాఖ డైరెక్టర్‌ రాముడు, డిప్యూటీ మేయర్‌ ముద్రనారాయణ తదితరులు సమావేశమయ్యారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, రోడ్లు పాడవకుండా, పాత డ్రైనేజీ స్థానంలోనే ఆధునిక భూగర్భడ్రైనేజీ సిస్టమ్‌ ఏర్పాటుపై ప్రతినిధులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం తిరుపతిలో సుమారు 50 కిలోమీటర్లు ఉండే డ్రైనేజీ వ్యవస్థలో ఆధునిక విధానాన్ని తొలుత రెండు కిలోమీటర్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సంబంధిత విభాగాన్ని కమిషనర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు భూమన అభినయ్‌రెడ్డి, రామస్వామి, వెంకటేశ్వర్లు, గణేష్‌, ఎస్‌ఈ మోహన్‌, ఎంఈ1,2 చంద్రశేఖర్‌, వెంకటరామిరెడ్డి, డీఈలు విజయ్‌కుమార్‌రెడ్డి, గోమతి, దేవిక, చంద్రశేఖర్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, సంజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T06:19:02+05:30 IST