ఉపాధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-18T04:22:19+05:30 IST

ఉపాధి పనుల పరిశీలన

ఉపాధి పనుల పరిశీలన
తిర్మలాపూర్‌ గ్రామ పంచాయతీని సందర్శించిన జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం

కులకచర్ల, మే 17: కులకచర్ల మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఉపాధిహామీ పథకం పనులను నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ (ఎన్‌ఎల్‌ఎం) బృందం పరిశీలించింది. మంగళవారం సాల్వీడ్‌, తిర్మలాపూర్‌, రాంపూర్‌, ఇప్పాయిపల్లి గ్రామాల్లో బృందం సభ్యులు పర్యటించి ఉపాధి హామీ పథకంలో జరిగిన డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, భూమి లెవలింగ్‌, కల్లాలు, పంచాయతీ భవనాల నిర్మాణం, ఉపాధి రిజిస్టర్లు, జాబ్‌ కార్డులను పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడారు. జాబ్‌ కార్డులు ఉన్నాయా..? కూలి డబ్బులు సకాలంలో అందుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనిదినాలు 100 నుంచి 150కి పెంచాలని, ఉపాధి పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కూలీలు ఈ సందర్భంగా వారిని కోరారు. పరిశీలించిన పనుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎల్‌ఎం బృందం సభ్యులు ఎంఎస్‌ మణివెల్‌, ఎం.దేవన్‌, డీఆర్‌డీవో పీడీ కృష్ణన్‌, ఏపీడీ సరళకుమారి, ఎంపీడీవో నాగవేణి, ఎంపీవో సుందర్‌, ఏపీవో వెంకటేశ్‌, ఈసీ, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T04:22:19+05:30 IST