ఆర్టీసీ బస్టాండు నూతన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఈడీ, ఆర్‌ఎం
పులివెందుల టౌన్, జనవరి 17: పులివెందులలో రూ.40కోట్లతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీ పనులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవివర్మ, రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డిలు సోమవారం పరిశీలించారు. అక్కడ జరుగు తున్న సీసీరోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ పనులపై ఆరాతీశారు. బస్టాండు ఆవరణలో చేపడుతున్న డీజల్ బంకు, బస్సుల వాషింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని వారు సూచించారు. అలాగే డీఎం కార్యాలయం, గ్యారేజీ గదులు, అర్నింగ్స్ గదులు తనిఖీ చేశారు. కార్యాక్రమంలో ఆర్టీసీ డీఎం వన్నూరు సాహెబ్, డీఈ పోతురాజు తదితరులు పాల్గొన్నారు.