మాస్టర్‌ప్లాన్‌ అభ్యంతరాలన్నీ పరిశీలన

ABN , First Publish Date - 2021-10-26T06:23:05+05:30 IST

వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌-2041పై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన మార్పులు చేశామని చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు.

మాస్టర్‌ప్లాన్‌ అభ్యంతరాలన్నీ పరిశీలన
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ విజయనిర్మల

బోర్డు సమావేశంలో వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ విజయనిర్మల

విశాఖపట్నం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌-2041పై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన మార్పులు చేశామని చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి అమరావతి నుంచి సోమవారం వర్చువల్‌ విధానంలో బోర్డు సమావేశం నిర్వహించారు. దీనికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్మి, వీఎంఆర్‌డీఏ కార్యదర్శి రఘునాథ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ, మార్పులు చేసిన ప్లాన్‌ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని, పరిశీలించి అమలుకు ఆమోద ముద్ర వేస్తామని చెప్పారు. పొరుగు జిల్లాల కలెక్టర్లు వారి వైపు నుంచి పలు మార్పులు సూచించారు. 


Updated Date - 2021-10-26T06:23:05+05:30 IST