మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎ్‌ఫవో, ఆర్డీవోలు
పెండ్లిమర్రి, జనవరి 27 : మండల పరిఽధిలోని పగడాలపల్లె రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 175లో ఐరన్‌ఓర్ తవ్వకాలకు పర్యావరణ అనుమతుల కోసం గురువారం డీఎ్‌ఫవో రవీంద్రధామ, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇనుప ఖనిజ తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందేందుకు సంబంధిత మైనింగ్ యజమాని పర్యావరణ అనుమతుల కోసం హైకోర్టును ఆశ్రయించారన్నారు. అధికారుల ఉత్తర్వుల మేరకు మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి నివేధికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్‌భాస్కర్‌రాజు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.