ఉదయం ఎడ్‌సెట్‌.. మధ్యాహ్నం లాసెట్‌

ABN , First Publish Date - 2020-10-01T18:02:53+05:30 IST

జిల్లాలో ఒకేరోజు రెండు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు జరగనున్నాయి. ఉదయం..

ఉదయం ఎడ్‌సెట్‌.. మధ్యాహ్నం లాసెట్‌

భీమవరంలో పరీక్ష కేంద్రాలు


భీమవరం(పశ్చిమ గోదావరి): జిల్లాలో ఒకేరోజు రెండు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు జరగనున్నాయి. ఉదయం ఎడ్‌ సెట్‌, మధ్యాహ్నం లాసెట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఆంధ్ర విశ్వవిద్యాల యం గురువారం నిర్వహిస్తున్న ఎడ్‌సెట్‌కు జిల్లాలో మూ డు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షను మొత్తం 480 మంది రాయనున్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజ నీరింగ్‌ కళాశాలలో 170 మంది, డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 160 మంది, పాలకోడేరు మండలం పెన్నాడ భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నందు 150 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష సమయానికి గంట ముందుగా హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు. 


లాసెట్‌కు 560 మంది

అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వ ర్యంలో గురువారం ఏపీ లాసెట్‌-2020 జరగనుంది. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీతోపాటు పీజీకి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని మూడు కేంద్రాల్లో 560 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యా హ్నం మూడు నుంచి నాలుగున్నర గంటల వరకు పరీక్ష జరుగుతుంది. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో 250 మంది, డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో 160 మంది, పాలకోడేరు మండలం పెన్నాడలోని భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళా శాలలో 150 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నా రు. పరీక్షకు గంట ముందుగానే విద్యార్థులు కేంద్రం వద్దకు హాజరు కావాలి. కొవిడ్‌ నిబంధనలు ఉన్నందున మాస్క్‌ ధరించి రావాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2020-10-01T18:02:53+05:30 IST