నాటి భారత్-చైనా యుద్ధంలో స్టార్ మెడల్... నేడు దీనస్థితిలో మాజీ జవాను!

ABN , First Publish Date - 2021-03-03T16:33:56+05:30 IST

భారత్- చైనా మధ్య 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొని...

నాటి భారత్-చైనా యుద్ధంలో స్టార్ మెడల్... నేడు దీనస్థితిలో మాజీ జవాను!

న్యూఢిల్లీ: భారత్- చైనా మధ్య 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొని, అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన నాటి జవాను నేడు కుటుంబ పోషణకు ఆటో నడపాల్సిన పరిస్థితిలో చిక్కుకున్నారు. భారత సైన్యానికి చెందిన చెందిన  మాజీ జవాను షేఖ్ అబ్దుల్లా కరీమ్ 1971లో జరిగిన భారత్ చైనా యుద్ధంలో పాల్గొని స్టార్ మెడల్ అందుకున్నారు. ఇప్పుడు అతను కడుపు నింపుకునేందుకు హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నారు. ప్రభుత్వం తనను ఆర్ధికంగా ఆదుకోవాలని షేఖ్  అబ్దుల్లా కోరుతున్నారు. 


ఈ సందర్భంగా మీడియాతో కరీమ్ మాట్లాడుతూ  ‘నా తండ్రి మరణించిన తరువాత నేను భారత సైన్యంలో చేరాను. బ్రిటీష్ సైన్యంలో, భారత సైన్యంలో పనిచేశాను. 1964లో నేను భారత సైన్యంలో చేరాను. 1971లో జరిగిన భారత్-చైనా యుద్ధంలో నైనికునిగా బాధ్యతలు నిర్వహించాను. లాహోల్‌లో విధులు నిర్వహించాను. అప్పట్లో నన్ను స్టార్ పతకంతో గౌరవించారు. ఇంతేకాదు 1971లో ప్రత్యేక పురస్కారాన్ని కూడా అందజేశారు.  అప్పట్లో తనకు భూమి కూడా ఇచ్చారని, అయితే అది పలు వివాదాల్లో ఉందని, ఇప్పటి వరకూ ఆ భూమి తన స్వాధీనం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు 71 ఏళ్లని, ఉండడానికి ఇల్లు కూడా లేదని, కుటుంబ పోషణకు ఆటో నడపాల్సి వస్తున్నదని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని షేఖ్ అబ్దుల్లా కోరుతున్నారు. 

Updated Date - 2021-03-03T16:33:56+05:30 IST