Ex-NCB officer Sameer Wankhede: ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ బెదిరింపు

ABN , First Publish Date - 2022-08-19T17:57:24+05:30 IST

నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు(Ex NCB officer Sameer Wankhede) సోషల్ మీడియా(social media) ద్వారా బెదిరింపు పోస్టు వచ్చింది....

Ex-NCB officer Sameer Wankhede: ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేను చంపేస్తామంటూ బెదిరింపు

ముంబయి: నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు(Ex NCB officer Sameer Wankhede) సోషల్ మీడియా(social media) ద్వారా బెదిరింపు పోస్టు వచ్చింది. ఆగస్టు 14వతేదీన అమన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి సమీర్ వాంఖడేకు బెదిరింపు వచ్చింది. ‘‘నీవు ఏం చేశావో నీకు తెలుసా? దానికి నీవు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది....నిన్ను హతమారుస్తాం’’ (death threat)అని ట్వీట్(Twitter) చేశారు. ఈ బెదిరింపు ట్వీట్ పై సమీర్ వాంఖడే గోరేగాం పోలీసులకు ఫిర్యాదు చేశారు.(Sameer Wankhede approached Goregaon police) దీంతో పోలీసులు వాంఖడే వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.


 బెదిరింపు ట్వీట్ వచ్చిన ట్విట్టర్ ఖాతాకు ఫాలోయర్స్ ఎవరూ లేరని, ఈ ఖాతాను సమీర్ వాంఖడేను బెదిరించేందుకు క్రియేట్ చేశారని పోలీసులు భావిస్తున్నారు.ముంబయి ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ వాంఖడే 2021 అక్టోబరులో క్రూయిజ్ షిప్ పై దాడి చేసి షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు 19 మంది ప్రముఖలను అరెస్టు చేసిన ఘటనతో వార్తల్లోకి ఎక్కారు.(Mumbai cruise after which the agency arrested actor Shah Rukh Khan's son Aryan Khan and 19 others)ఈ డ్రగ్స్ కేసులో(drugs case) అవినీతి ఆరోపణలు రావడంతో సమీర్ వాంఖడే నుంచి కేంద్ర ఎన్సీబీ బృందానికి దర్యాప్తు బాధ్యత అప్పగించారు. 


ఈ కేసుపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టింది. బాలీవుడ్ సెలబ్రిటీలు దీపికా పడుకోన్,సారాఅలీఖాన్, రకూల్‌ప్రీత్ సింగ్ లను(high profile celebrities like Deepika Padukone, Sara Ali Khan, Rakulpreet Singh) డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే విచారించడం సంచలనం రేపింది. 


Updated Date - 2022-08-19T17:57:24+05:30 IST