ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ వచ్చినా..: పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2021-11-02T20:12:16+05:30 IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు అటు టీఆర్ఎస్‌లోనే కాకుండా.. కాంగ్రెస్‌లో కూడా కాకరేపుతున్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గట్టి కేడర్ ఉన్నా కానీ పార్టీ పట్టించుకోలేదని

ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ వచ్చినా..: పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు అటు టీఆర్ఎస్‌లోనే కాకుండా.. కాంగ్రెస్‌లో కూడా కాకరేపుతున్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గట్టి కేడర్ ఉన్నా కానీ పార్టీ పట్టించుకోలేదని ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు నెలలు ఖాళీగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా హుజూబాద్‌లో ఈటెల విజయావకాశాలపై స్పందించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 


‘హుజురాబాద్ ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయి. అప్రజాస్వామికంగా మంత్రి వర్గం నుంచి తొలగించారనే అంశాన్ని ఈటల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇది బీజేపీ విజయంగా బండి సంజయ్ చెప్పడం దురదృష్టం. ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదు. ఈటల రాజేందర్ ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థి అని చెప్పుకోలేదు. ఇది పూర్తిగా ఈటల రాజేందర్ గెలుపే. కాంగ్రెస్ ఓటమి ఊహించిందే. ఉత్తమ్ పీసీసీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి మీద దృతరాష్ట్రుడి ప్రేమ చూపించారు.  అది పార్టీకి నష్టం చేసింది. రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు.’ అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-02T20:12:16+05:30 IST