Kvp Letter Jagan: పోలవరం జాప్యంపై కేవీపీ ఆగ్రహం.. కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ లేఖ

ABN , First Publish Date - 2022-09-27T22:57:43+05:30 IST

పోలవరం (Polavaram) నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను రాష్ట్రానికి వదిలేసి కేంద్రం చోద్యం చూస్తోందని...

Kvp Letter Jagan: పోలవరం జాప్యంపై కేవీపీ ఆగ్రహం.. కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ లేఖ

అమరావతి (Amaravati): పోలవరం (Polavaram) నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను రాష్ట్రానికి వదిలేసి కేంద్రం చోద్యం చూస్తోందని మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు (Kvp Ramachandrarao) మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan Mohan Reddy)కి ఆయన లేఖ రాశారు.


పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత పోలవరం అథారిటేనని.. ఈ నెల 29న కేంద్రం సమక్షంలో జరిగే సమావేశంలో గట్టిగా డిమాండ్ చేయాలని లేఖలో కోరారు.  కేంద్రం తీరు వల్లే పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఒడిస్సా, ఛత్తీస్‎గఢ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని చెప్పారు.  పోలవరం ప్రాజెక్టు కరకట్టల నిర్మాణానికి ఒడిస్సా, ఛత్తీస్‎గఢ్ ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని జగన్‎కు లేఖలో కేవీపీ తెలిపారు. 



Updated Date - 2022-09-27T22:57:43+05:30 IST