Abn logo
May 29 2020 @ 14:59PM

‘ఎక్కువ స్థానాలు గెలిచామని.. ఏం చేసినా చెల్లుతుందనుకోకూడదు’

రాజమండ్రి: హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పు దెబ్బవంటిదన్నారు. ఏపీలో రాజ్యాంగాన్ని హైకోర్టు పరిరక్షింస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు హైకోర్టు తప్పుబడుతుందని హర్షకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్ల రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రతీ ఒక్కరిపైన ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఎక్కువ స్థానాలు గెలిచామని, ఏం చేసినా చెల్లుతుందన్న మైండ్ సెట్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలని హర్షకుమార్ పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement