రెండేళ్లయినా ప్రత్యేక హోదా ఏదీ?

ABN , First Publish Date - 2021-06-20T05:26:25+05:30 IST

నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 25మంది ఎంపీలను గె లిపిస్తే కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఎన్నికలయ్యాక ఆ ఊసే ఎత్తటం లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రెండేళ్లయినా ప్రత్యేక హోదా ఏదీ?
యరపతినేని శ్రీనివాసరావు

యరపతినేని శ్రీనివాసరావు 

పిడుగురాళ్ల, జూన్‌ 19: నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 25మంది ఎంపీలను గె లిపిస్తే కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఎన్నికలయ్యాక ఆ ఊసే ఎత్తటం లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌ సభ్యులు, కేంద్రంలో ఉన్న మంత్రులు రాజీనామా చేయండని పదే పదే మాట్లాడిన వైఎస్‌ జగన్‌ ఇవాళ ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటంలేదన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు సాష్టాంగ నమస్కారం చేస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల పేరిట వైసీపీ కార్యకర్తలకు వలంటీర్‌ ఉద్యోగాలిచ్చి లక్షల ఉద్యోగాలిచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక్కడ ఉపాధి లేక యువత బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వైపు పరుగులు తీస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల సొంత ఫ్యాక్టరీల్లో తయారుచేసిన నాసిరకమైన లిక్కర్లు ప్రజల మీదకువదిలి ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారన్నారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమ, అమరావతి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ తయారైపోయిందన్నారు. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నాయకులు ఇద్దరిని హత్యచేసి మిగతా జిల్లాలలో కూడా టీడీపీ నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం హత్యారాజకీయాలు చేయటం దేనికి సంకేతమో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మటం, తాకట్టుపెట్టటం ద్వారా వచ్చే డబ్బుతో రాష్ట్రాన్ని ఎన్నాళ్లు పరిపాలిస్తారని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లలో తెచ్చిన లక్షల కోట్లరూపాయల అప్పులతో ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను, నాయకులను ఎంత ఇబ్బందులకు గురిచేసినా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తారని యరపతినేని తెలిపారు. 


Updated Date - 2021-06-20T05:26:25+05:30 IST