యరపతినేని శ్రీనివాసరావు
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
పిడుగురాళ్ల, జనవరి 27: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చకపోగా వారిపై అసత్యప్రచారం చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లన్నీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చినవేనని గుర్తు చేశారు. వారి మద్దతుతో అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలను అవమానాలకు గురిచేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వలంటీర్ల ద్వారా ఇంటింటా ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం చేయడాన్ని మానుకోవాలన్నారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు టీడీపీ మద్దతు ఇస్తుందని యరపతినేని తెలిపారు.