పల్లెపిలుస్తోంది... భేష్‌

ABN , First Publish Date - 2022-06-25T05:51:57+05:30 IST

గురజాల నియోజకవర్గంలో పల్లె పిలుస్తోంది కార్యక్రమానికి, పల్లెనిద్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు నాకు రిపోర్టులు అందాయి... ఇక మున్ముందు కూడా ఆ రెండు కార్యక్రమాలు కొనసాగిస్తూ పల్నాడులోని ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు.

పల్లెపిలుస్తోంది... భేష్‌
నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని

కార్యకర్తలకు అండగా ఉండు

నీకు నేనున్నానంటూ చంద్రబాబు భరోసా 

టీడీపీ అధినేతతో యరపతినేని భేటీ 

పిడుగురాళ్ల, జూన్‌ 24: గురజాల నియోజకవర్గంలో పల్లె పిలుస్తోంది కార్యక్రమానికి, పల్లెనిద్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు నాకు రిపోర్టులు అందాయి... ఇక మున్ముందు కూడా ఆ రెండు కార్యక్రమాలు కొనసాగిస్తూ పల్నాడులోని ప్రతి  కార్యకర్తకు అండగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు సూచించారు.  నేను కూడా నీకు పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం చంద్రబాబును యరపతినేని కలిశారు. పల్నాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వివరించారు. గురువారం నాడు పల్నాడులో లోకేశ్‌ పర్యటనతో కార్యకర్తల్లో మంచి జోష్‌ వచ్చిందని ఇప్పటి దాకా వైసీపీ అరాచకాలు, అక్రమాలపై కొంత వెనుకడుగు వేసినవారు కూడా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారని యరపతినేని వివరించారు. గురజాల నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారి వెన్నంటే ఉంటున్న యరపతినేనిని చంద్రబాబు భుజం తట్టి మాట్లాడారు. ఇక నుంచి కూడా ప్రతి కార్యకర్తకు నేనున్నాననే భరోసా కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక  గురజాల నియోజకవర్గంలో వైసీపీ ఫ్యాక్షన్‌ రాజకీయాలకు 9 మంది పార్టీ కార్యకర్తలు బలయ్యారని, వైసీపీ చేస్తున్న అక్రమ మైనింగ్‌తో మరో ఏడుగురు పిల్లలు చనిపోయిన విషయాన్ని యరపతినేని  వివరించారు. జనవరి నెలలో వెల్దుర్తి మండలానికి చెందిన తోట చంద్రయ్య, గత వారం దుర్గి మండలానికి చెందిన జల్లయ్య యాదవ్‌ హత్య అనంతరం పల్నాడులో ఉన్న పరిస్థితులను తెలిపారు.  కార్యకర్తల్లో మనోధైర్యం నింపే విధంగా తోట చంద్రయ్య అంత్యక్రియలకు హాజరై మీరు పాడె మోయటంతోపాటు ఆ కుటుంబానికి అండగా ఉంటూ రూ.25 లక్షల ఆర్థికసాయాన్ని అందించటం, అదేవిధంగా జల్లయ్య యాదవ్‌ హత్యపై కూడా పార్టీ తరపున స్పందించిన తీరు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. జల్లయ్య దశదిన కర్మలకు లోకేశ్‌ హాజరుకావటంతోపాటు కుటుంబానికి రూ.25 లక్షలు అందించడం పార్టీ కార్యకర్తల్లో కూడా కొండంత ధైర్యాన్ని నింపిందని యరపతినేని తెలిపారు.  మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లాగానే పల్నాడు పర్యటనకు మీరు వచ్చినా, లోకేశ్‌ వచ్చినా ప్రజలు నీరాజనం పడతారన్నారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా  యరపతినేని కలిశారు. 

 

Updated Date - 2022-06-25T05:51:57+05:30 IST