గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-01-27T04:55:35+05:30 IST

ప్రభుత్వం కొత్తజిల్లాల ఏర్పాటుకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో పల్నాడుకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సి వస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలి
యరపతినేని శ్రీనివాసరావు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని 

పిడుగురాళ్ల, జనవరి26: ప్రభుత్వం కొత్తజిల్లాల ఏర్పాటుకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో పల్నాడుకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సి వస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు పేరుపెట్టి నరసరావుపేట జిల్లాకేంద్రంగా కాకుండా గురజాలను కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పల్నాడు ఈ రోజు పారిశ్రామికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుందని తెలిపారు. అపారమైన ఖనిజ సంపద, సిమెంట్‌ పరిశ్రమలతోపాటు ఆసియా ఖండంలోని ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసే మిర్చిపంట పల్నాడులోనే అధికంగా ఉన్నట్లు తెలిపారు. మాచర్ల చెన్నకేశవ ఆలయం, గుత్తికొండ బిలం, సత్రశాల, దైదా అమరలింగేశ్వరస్వామి, నాగార్జునసాగర్‌ ఇక్కడ ఉన్నాయని గుర్తు చేశారు. రైలు, జాతీయ రహదారి మార్గంతోపాటు అన్ని వనరులు ఉన్న పల్నాడు విశిష్టతను దృష్టిలో ఉంచుకొని గురజాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని యరపతినేని కోరారు. అలాకాకుండా ప్రభుత్వం మరోలా ఆలోచిస్తే పార్టీలకు అతీతంగా ప్రజలతో ఉద్యమంతోపాటు అవసరమైతే న్యాయపరంగా ఉద్యమిస్తామని తెలిపారు. 


Updated Date - 2022-01-27T04:55:35+05:30 IST