బెదిరింపులకు భయపడేది లేదు..

ABN , First Publish Date - 2022-06-30T05:13:36+05:30 IST

చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చే సైనికుడిని నేను.. కేసులు, బెదిరింపులకు భయపడం... నోరు జారితే బట్టలూడదీసి బజారులో నిలబెడతాం.. మాతో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో... భవిష్యత్‌లో అలాగే ప్రవరిస్తాం అంటూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.

బెదిరింపులకు భయపడేది లేదు..
సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యేయరపతినేని

చంద్రబాబుకోసం ప్రాణాలిచ్చే సైనికుడిని నేను 

మాజీ ఎమ్మెల్యే యరపతినేని

 దాచేపల్లి, జూన్‌ 29: చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చే సైనికుడిని నేను.. కేసులు, బెదిరింపులకు భయపడం... నోరు జారితే బట్టలూడదీసి బజారులో నిలబెడతాం.. మాతో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో... భవిష్యత్‌లో అలాగే ప్రవరిస్తాం అంటూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. దాచేపల్లిలోని నాగిరెడ్డి కల్యాణ మండపంలో బుధవారం  ఏర్పాటుచేసిన గురజాల నియోజకవర్గ టీడీపీ, ఐటీడీపీ క్రియాశీలక సభ్యత్వనమోదు సమీక్షా సమావేశానికి యరపతినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో యరపతినేని మాట్లాడుతూ వైసీపీ జెండా ఇడుపులపాయలో సమాధిలో పుట్టింది.. టీడీపీ జెండా మహనీయుడు ఎన్టీఆర్‌ చేతిలో పుట్టింద ంటూ వివరించారు.  వైసీపీ వాళ్లందరూ శత్రువులు కాదు... టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని మాత్రమే టార్గెట్‌ చేస్తాం అన్నారు. నాకు 20ఏళ్ల వయస్సులోనే మాచర్లకు ఎన్టీఆర్‌ను తీసుకురావద్దని, మీ బాబాయి సుందరరామిరెడ్డి బెదిరించాడు. అప్పుడే నేను బెదరలేదు. అలాంటిది ఇప్పుడు నీకు జంకుతానా అంటూ కౌంటర్‌ ఇచ్చారు. అధికారం ఉందికదా అని విర్రవీగిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారన్నారు. సరస్వతి భూముల కేసుల్లో కేసుల నుంచి తప్పించమని కోరిన వీళ్లు ఈ రోజు హద్దుమీరి మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మాజీ సీఎం భార్య, మాజీ సీఎం కూతురు, కాబోయే సీఎం తల్లిని దుర్భాషలాడటం వైసీపీ పతనానికి పరాకాష్ట అన్నారు. నోరు ఇష్టానుసారంగా పారేసుకునే వీళ్లకు ప్రకృతే సమాధానం చెప్తుందన్నారు. లోకేశ్‌ పర్యటనకు ఎన్ని నిర్బంధాలు, ఆటంకాలు కల్పించినప్పటికీ గురజాల నియోజకవర్గం నుంచి  20వేలకు పైగా కార్యకర్తలు కదలి వచ్చారని తెలిపారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:13:36+05:30 IST