మా సమస్యలు పట్టించుకునే నాఽథుడే లేరయ్యా!

ABN , First Publish Date - 2020-11-30T04:25:23+05:30 IST

పట్టణ శివార్లలో కనీస వసతులు లేకుండా నివసిస్తున్న పేద ప్రజల గోడును పట్టించుకునే నాఽథుడు లేరని ఆయా కాలనీల్లో ఆదివారం పర్యటించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఎదుట బాధితులు తమ గోడు విన్నవించుకున్నారు.

మా సమస్యలు పట్టించుకునే నాఽథుడే లేరయ్యా!
విష్ణువర్ధన్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న ప్రజలు

కావలి, నవంబరు 29: పట్టణ శివార్లలో కనీస వసతులు లేకుండా నివసిస్తున్న పేద ప్రజల గోడును పట్టించుకునే నాఽథుడు లేరని ఆయా కాలనీల్లో ఆదివారం పర్యటించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఎదుట బాధితులు తమ గోడు విన్నవించుకున్నారు. వర్షాలతో దెబ్బతిన్న పట్టణంలోని ముసునూరు ఇందిరమ్మ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల కాలనీల్లో మోకాటి లోతులో నీరు నిల్వ ఉందని, కాలనీల్లోకి వెళ్లేందుకు దారిలేక పోవడంతోపాటు విద్యుత్‌లేక అంధకారంలో ఉన్నామన్నారు. నాల్గు రోజులుగా కాలనీలు మునకలో ఉండడంతో తింటానికి తిండి కూడా లేక అల్లాడుతుంటే అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు. దీంతో విష్ణువర్ధన్‌ రెడ్డి ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారికి విద్యుత్‌ సౌకర్యం కల్పించి, వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసి ఆహారం అందచేయాలని జిల్లా కలెక్టర్‌ దృష్టికి, స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట టీడీపీ నాయకులు గ్రంధి యానాదిశెట్టి, బొట్లగుంట శ్రీహరినాయుడు, జ్యోతిబాబూరావు, కర్నాటి సుబ్బారావు, దామా మాల్యాద్రి, బాలకృష్ణరాజు, పోతుగంటి శ్రీకాంత్‌ ఉన్నారు.

Updated Date - 2020-11-30T04:25:23+05:30 IST