Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీతోనే భావితరాలకు భవిష్యత

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

నగదు, బంగారం ఇచ్చిన వెంకటరావమ్మకు సత్కారం

పొన్నూరు, అక్టోబరు 23: భావితరాల భవిష్యత టీడీపీతోనే సాధ్యమని సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు.  వైసీపీ గూండాలు ధ్వంసం చేసిన టీడీపీ కేంద్రకార్యాలయానికి మరమ్మతులు చేయాలని నిడుబ్రోలుకు చెందిన జాగర్లమూడి వెంకటరావమ్మ తన బంగారు గొలుసు, 5 వేలు నగదును నరేంద్రకుమార్‌కు అందచేశారు. ఈ క్రమంలో శనివారం ఆమె  నివాసానికి వెళ్లిన నరేంద్ర ఆమెను పూలమాలలతో  సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావంతోనే  రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగాయని తెలిపారు. భావితరాలకు వెలుగునిచ్చే టీడీపీ కార్యాలయం ఈ విధంగా ఉండటం చూడలేక నగదు, బంగారు గొలుసు అందచేసిన్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహం చుట్టూ ఉన్న పగిలిన అద్దాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా ఈ మొత్తం అందచేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు అహ్మద్‌ఖాన్‌, బొర్రురామారావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ ఆరె ప్రసాదరావు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్లు నన్నపనేని ప్రభాకరరావు, మాదాల వెంకటేశ్వరరావు, పి.సుబ్బారావు, గోగినేని వెంకటేశ్వరరావు, వెంకటరావమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.    


Advertisement
Advertisement