ముగ్గుల పోటీ విజేతకు బహుమతులు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
ఈపూరు, జనవరి16: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో బసవతారకం మెమోరియల్ ఆద్వర్యంలో పోట్ల నాగేశ్వరరావు జ్ఞాపకార్ధం శివశక్తిలీలా అండ్ అంజన్ పౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ముగ్గులు పోటీలను నిర్వహించారు. ఉత్సాహభరితంగా సాగిన రంగవల్లుల పోటీలకు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ముగ్గులను పరిశీలించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.