మహానందిలో మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-01T05:44:09+05:30 IST

మహానంది ఆలయంతో పాటు రాష్ట్రంలోని నాలుగు ఆలయాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్‌ ఇచ్చారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

మహానందిలో మాజీ ఎమ్మెల్యే
వేదపండితుల ఆశీర్వాదం పొందుతున్న బుడ్డా

మహానంది, ఫిబ్రవరి 28: మహానంది ఆలయంతో పాటు రాష్ట్రంలోని నాలుగు ఆలయాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్‌ ఇచ్చారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మహానంది క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌ ఆద్వర్యంలో ఆయనను శాల్వతో సత్కరించి ప్రసాదాలు అందచేశారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ఆలయంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన సిబ్బంది పెన్షన్‌ లేక ఇబ్బందిపడేవారని అన్నారు. వీరికి గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోతో పెన్షన్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలం నియోజిక వర్గం టీడీపీ సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి, మహానంది దేవస్థానం మాజీ చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు, టీడీపీ మండల అధ్యక్షుడు ఉల్లిమధు ఉన్నారు. 


‘మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటుదాం’


మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటుదామని శ్రీశైలం మాజీ ఎమ్మెల్మే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గాజులపల్లి ఆర్‌ఎస్‌ గ్రామంలో టీడీపీ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాదించిన సర్పంచ్‌ అస్లాంబాషాను గ్రామస్థులు సన్మానించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా హాజరై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఆగడాలతో పాటు ప్రజలు దౌర్జన్యాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జమిలి ఎన్నికలు వస్తే తప్పక టీడీపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ అస్లాంబాషాను బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. 


Updated Date - 2021-03-01T05:44:09+05:30 IST