నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అవినీతి చిట్టాను త్వరలో సీరియల్‌గా బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సవాల్‌కు.. ప్రతి సవాల్ విసిరారు.
ఆఖరికి రూ.5వేలు కూడా వదలకుండా మామూళ్లు తీసుకునే చంద్రశేఖర్ రెడ్డి... తనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులే భయటపెడుతున్నారని చెప్పారు. త్వరలో చంద్రశేఖర్ రెడ్డి అవినీతి చిట్టాను.. సీరియల్‌గా భయటపెడతానని తెలిపారు. ఉదయగిరి అభివృద్ధి, అవినీతిపై తాను బహిరంగ చర్చకి సిద్ధమని రామారావు పేర్కొన్నారు.