Andhra Pradesh: కావ్యరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి.

ABN , First Publish Date - 2022-05-19T19:40:07+05:30 IST

పొదలకూరు మండలం తాటిపర్తిలో హత్యకు గురైన కావ్య కుటుంబ సభ్యులను‌ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావ్యరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో

Andhra Pradesh: కావ్యరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి.

నెల్లూరు: పొదలకూరు మండలం తాటిపర్తిలో హత్యకు గురైన కావ్య కుటుంబ సభ్యులను‌ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావ్యరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగిన గన్ కంటే ముందుగా వస్తానన్న జగన్ ఏమయ్యాడని సోమిరెడ్డి ప్రశ్నించారు. కావ్యరెడ్డి హత్యకు నురేష్ రెడ్డి వాడిన గన్ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజుకో అఘాయిత్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా 800 మందిపై అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. 



Updated Date - 2022-05-19T19:40:07+05:30 IST