అసదుద్దీన్ నీకు ఏమైనా జ్ఞానం ఉందా: Shabbir ali

ABN , First Publish Date - 2022-05-08T20:55:58+05:30 IST

రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ను విమర్శించారు.నీగురించి గానీ నీ పార్టీ గురించి గానీ రాహుల్ మాట్లాడలేదు.

అసదుద్దీన్ నీకు ఏమైనా జ్ఞానం ఉందా: Shabbir ali

హైదరాబాద్: రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ను విమర్శించారు.నీగురించి గానీ నీ పార్టీ గురించి గానీ రాహుల్ మాట్లాడలేదు.అయినా నీ కడుపు ఎందుకు నొప్పిలేస్తుందని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(shabbir ali)ప్రశ్నించారు. నువ్వు బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్ వని రుజువైందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కు బ్రోకర్ వి అంటూ అసదుద్దీన్ ఓవైసీ(asaduddin owaisi)ని విమర్శించారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టవు? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మూడు ఒక్కటేనని షబ్బీర్ వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ స్థాయి ఏంటో, గౌరవం ఏందో మొన్నటి ఎన్నికల్లో తేలిందని ఎద్దేవా చేశారు. 

Read more