అన్నాడీఎంకేలో నాయకత్వ లేమి

ABN , First Publish Date - 2022-02-25T16:18:32+05:30 IST

అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి సెల్లూర్‌ కె. రాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా తన పార్టీపైనే విమర్శలు గుప్తించారు. అన్నాడీఎంకే నాయకత్వలేమితో సతమతమైపోతోందని,

అన్నాడీఎంకేలో నాయకత్వ లేమి

                    - మాజీ మంత్రి సెల్లూరు కె.రాజు సంచలన వ్యాఖ్యలు


అడయార్‌(చెన్నై): అన్నాడీఎంకే  సీనియర్‌ నేత, మాజీ మంత్రి సెల్లూర్‌ కె. రాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా తన పార్టీపైనే విమర్శలు గుప్తించారు. అన్నాడీఎంకే నాయకత్వలేమితో సతమతమైపోతోందని, నాయకుడు లేని పార్టీగా మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాల్లో చర్చనీ యాంశంగా మారాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 74వ జయంతిని పురస్కరించుకుని గురువారం మదురై కేకే నగర్‌లో జరిగిన కార్యక్రమంలో జయ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సెల్లూర్‌ కె.రాజు మీడియాతో మాట్లాడుతూ... జయ లేని తరుణంలో ఏ ఒక్క పార్టీతో పొత్తు లేకుండా అన్నాడీఎంకే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిందని, అన్నాడీఎంకేలో నాయకత్వమే లేదన్నారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి కారణాలను అన్వేషించాలన్నారు. ఇదే విషయంపై సమావేశం నిర్వహించి విఫులంగా చర్చించాలన్నారు. బీజేపీ మూడో అతిపెద్ద పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై పేర్కొంటారనీ, ఆయనే కాదు ఆ పార్టీ నేతలు కూడా అలానే మాట్లాడుతుంటారన్నారు. రాష్ట్రంలో డీఎంకే లేదా అన్నాడీఎంకేలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంటాయని, ఇతర పార్టీలు ఏవీ కూడా అధికారంలోకి రాలేవని సెల్లూర్‌ రాజు అన్నారు.  

Updated Date - 2022-02-25T16:18:32+05:30 IST