రాష్ట్ర పరువు తీస్తోన్న పోలీసులు

ABN , First Publish Date - 2022-01-18T06:26:48+05:30 IST

పూర్తిగా పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

రాష్ట్ర పరువు తీస్తోన్న పోలీసులు
సమావేశంలో మాట్లాడుతున్న పుల్లారావు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, డాక్టర్‌ అరవిందబాబు

జొన్నలగడ్డలో వారి తీరు బాధాకరం

నరసరావుపేట టౌన్‌, జనవరి 17: పూర్తిగా పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులు  ఆంధ్రప్రదేశ్‌ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకం ర్యాజమేలుతుందని, డీజీపీ మౌనముద్ర వీడాలన్నారు. జొన్నలగడ్డలో  పోలీసుల లాఠీచార్జి, వారు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. మంచి వైద్యుడు, బలహీన వర్గాల చెందన వ్యక్తి అయిన అరవిందబాబుపై దాడి చేయడం అంటే  పోలీస్‌ వ్యవస్థ ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నారు. పోలీస్‌ సమక్షంలోనే రాళ్లు వేసిన, అంబులెన్స్‌పై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  వైఎస్‌ విగ్రహం మాయం మాచర్ల సంఘటన పక్కదారి పట్టించడానికా లేదంటే సానుభూతి పొందడానికి చేశారా అనేది వాళ్ళే చెప్పాలన్నారు.    డీజీల్‌పై వ్యాట్‌ను తగ్గించి, గ్రీన్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా విద్యాసంస్థలకు సెలవులు పొడగించాలని డిమాండ్‌ చేశారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ అన్ని రంగాలలో విఫలైమన ప్రభుత్వం దానిని అధిగమించడానికి ప్రజల మధ్య చిచ్చుపెట్టే సంప్రదాయానికి తెరలేపారని విమర్శించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రాజశేకరరెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే దగ్గర ఉండి వైసీపీ కార్యకర్తల చేత మాయం చేయించారని ఆరోపించారు. టీడీపీలో ఇటువంటి పనులు చేసేవారు లేరని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉంటే అంబులెన్స్‌పైనా దాడి చేసి హత్యాయత్నం చేశారని చెప్పారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రమేష్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్‌, మానుకొండ శివప్రసాద్‌, వల్లెపు నాగేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అఽధ్యక్షుడు పూదోట సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-18T06:26:48+05:30 IST