ఓటీఎస్‌ పేరుతో నిర్బంధ వసూళ్లు తగదు

ABN , First Publish Date - 2021-12-09T05:14:09+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి నిర్బంధ వసూలు చేస్తూ.. మరోవైపు ఒత్తిడి చేయడంలేదని ప్రకటన చేయడం హాస్యాస్పందంగా ఉందని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

ఓటీఎస్‌ పేరుతో నిర్బంధ వసూళ్లు తగదు
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, డిసెంబరు8: ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి నిర్బంధ వసూలు చేస్తూ.. మరోవైపు ఒత్తిడి చేయడంలేదని ప్రకటన చేయడం హాస్యాస్పందంగా ఉందని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలోని తన నివాసగృహంలో బుధవారం ప్రత్తిపాటి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లబ్ధిదారులు ఓటీఎస్‌ నగదు చెల్లించకుండా తిరగబడాలని, ప్రజా ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ప్రజలకు రక్షణలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని.. యడ్లపాడు మండలం లింగారావుపాలెం, సొలస ప్రాంతాల్లో రెండు రోజులపాటు వరుసగా జరుగుతున్న దారిదోపిడీలపై ప్రత్తిపాటి స్పందించారు. ప్రభుత్వం పోలీసులను శాంతిభద్రతలకు వినియోగించకుండా ఎమ్మెల్యేలు, మంత్రులకు కాపలా కాయడంతోపాటు మద్యం అమ్మకాలకు వినియోగిస్తోందని విమర్శించారు. చివరకు ఐఏఎస్‌లు కూడా మద్యం అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరారవు, సమద్‌ఖాన్‌, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మదన్‌ తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-12-09T05:14:09+05:30 IST