జగన్‌ది నయవంచన పాలన : మాజీ మంత్రి కొల్లు

ABN , First Publish Date - 2022-08-19T05:20:10+05:30 IST

గన్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నయవంచన, స్వార్థ ప్రయోజనాలు మినహా సాధించిందేమీ లేదని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర విమర్శించారు.

జగన్‌ది నయవంచన పాలన : మాజీ మంత్రి కొల్లు
సమావేశంలో మాట్లాడుతున్న రవీంద్ర

నూజివీడు, ఆగస్టు 18: జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నయవంచన, స్వార్థ ప్రయోజనాలు మినహా సాధించిందేమీ లేదని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. గురువారం నూజివీడు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబో యిన వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన విలేకర్ల సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో తప్పులపై తప్పులు చేస్తూ, అన్నివర్గాలను మోసం చేస్తూ నయవంచనతో పాలన సాగిస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే వారంలో సీపీఎస్‌ రద్దుచేస్తానన్న జగన్‌ మూడున్న రేళ్లయినా చర్యలు తీసుకోలేదన్నారు. టీచర్లు మళ్లీ ఉద్యమబాట పడతారని, వారిని మభ్యపెట్టేందుకు చర్చలపేరుతో మరో నయవంచనకు జగన్‌రెడ్డి తీరతీస్తున్నారని విమర్శించారు. ‘నాడు–నేడు’లో రూ.4 వేల కోట్లతో పాఠశాల లను అభివృద్ధి పరిచి, నేడు విలీనం పేరుతో ఆ నిధులను నిరుపయోగం చేశారన్నారు. జిల్లాల విభజన, మూడు రాజధానులు, బీసీ కార్పొరేషన్‌ విభజనలతో కులాల మధ్య జగన్‌ చిచ్చు పెట్టారని,  56 కుల కార్పొ రేషన్‌లు ఏర్పాటు చేసిన జగన్‌ ఏ ఒక్క కార్పొరేషన్‌ ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ హ యాంలో రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపితే వైసీపీ ఎంపీ మాధవ్‌ చర్యలతో జాతీయస్థాయిలో ఆంధ్రా పరువును నట్టేట ముంచారన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు ముసునూరు రాజా, నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు జగ్గవరపు వెంకటరెడ్డి, ఎస్సీ సెల్‌ నాయకులు అరికోటి సంగీతరావు, టీడీపీ పట్టణ, మండల కార్యదర్శులు పల్లి నాగరాజు, ముదగన గిరిబాబు, గోగినేని మధు, టి.రాజశేఖర్‌, అన్నే సురేష్‌, బి.ప్రభాకరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:20:10+05:30 IST