Abn logo
Aug 11 2020 @ 21:09PM

మాజీ మంత్రి, వైసీపీ నేత కన్నుమూత

కడప : మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఖలీల్ మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. బాషా అంత్యక్రియలు రేపు అనగా బుధవారం నాడు కడప జిల్లాలో జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు.


కాగా.. టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అనంతరం గతేడాది ఫిబ్రవరి-05న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement