మా పాలన స్వర్ణయుగం: డీఎంకేది రాతియుగం!

ABN , First Publish Date - 2022-05-17T15:31:23+05:30 IST

అన్నాడీఎంకే ప్రభుత్వ పరిపాలన స్వర్ణయుగమని ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పాలన రాతియుగమని మాజీ మంత్రి జయకుమార్‌ విమర్శించారు. సోమవారం ఉదయం బెయిలు

మా పాలన స్వర్ణయుగం: డీఎంకేది రాతియుగం!

                         - మాజీ మంత్రి జయకుమార్‌ 


చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వ పరిపాలన స్వర్ణయుగమని ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పాలన రాతియుగమని మాజీ మంత్రి జయకుమార్‌ విమర్శించారు. సోమవారం ఉదయం బెయిలు షరతుల ప్రకారం వేప్పేరిలోని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఆయన సంతకం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేశారని, నిరుపేద పెళ్లీడు యువతులకిచ్చే తాళికి బంగారం పథకం అమలు చేయడం లేదని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా అన్నాడీఎంకే ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం హీరోలా ఉండేదని, డీఎంకే  వచ్చాక ‘జీరో’గా మారిందని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే తరఫున రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం కలిసకట్టుగా నిర్ణయం తీసుకుంటారని వివరించారు. 

Updated Date - 2022-05-17T15:31:23+05:30 IST