వచ్చేది టీడీపీ ప్రభుత్వమే: మాజీ మంత్రి

ABN , First Publish Date - 2022-05-16T05:07:24+05:30 IST

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిలప్రియ అన్నారు.

వచ్చేది టీడీపీ ప్రభుత్వమే: మాజీ మంత్రి
మాట్లాడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

రుద్రవరం, మే 15: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిలప్రియ అన్నారు. మండలంలోని శ్రీరంగాపురంలో ఆదివారం ఆమె  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడం ఈ నాయకులకు చేత కాకనే అధోగతిపాలు చేశారని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గడపగడపకు అని చేపట్టిందని, అయితే వైసీపీ నాయకులకు ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం కూడా లేదని అన్నారు. రోడ్లు కూడా సక్రమంగా వేయలేదని, పంటలకు రైతులు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేశామని గుర్తుచేశారు. ఎరువుల ధరలు పెంచి రైతులను దెబ్బతీస్తున్నారని అఖిలప్రియ మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గడపగడకు అని వెళ్లి ఐదు గుళ్లలో పూజలు చేసి తిరిగి వచ్చి ఇంట్లో కూర్చున్నారని ఆమె విమర్శించారు. రౌడీలకు, గుండాలను వలంటీర్లగా ఎంపిక చేసి సన్మానం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందే తప్పా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యాచారాలు అధికంగా జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణ మన్నారు. మాజీ ఎమ్మెల్యే, తన తల్లి శోభానాగిరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రజ లకు తామున్నామంటూ భరోసా ఇచ్చారని, అలాగే తాము కూడా ఇంటింటికి తిరిగి మహిళలకు, రైతులకు, యువతకు భరోసా కల్పిస్తామని తెలిపారు.


‘చంద్రబాబు పర్యటనకు తరలి రావాలి’


టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 19న జిల్లాలోని డోన్‌ నియోజకవర్గంలో పర్యటిస్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లు సుబ్బమ్మ, చంద్రమోహన్‌, నాయ కులు జంగా పెద్దపుల్లారెడ్డి, రెక్కల మనోహర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌లు నారాయణరెడ్డి, లక్ష్మీకాంత్‌, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-05-16T05:07:24+05:30 IST