నిధుల్లో అవకతవకలపై చర్చకు సిద్ధమా?: AP మాజీ మంత్రి దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-06-05T21:49:03+05:30 IST

నిధుల్లో అవకతవకలపై చర్చకు సిద్ధమా?: AP మాజీ మంత్రి దేవినేని ఉమ

నిధుల్లో అవకతవకలపై చర్చకు సిద్ధమా?: AP మాజీ మంత్రి దేవినేని ఉమ

Amaravathi: పోలవరం నిర్వాసితులకు మంజూరైన నిధుల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. వాటిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మరి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఇంకా ఏమన్నారంటే..

‘‘2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ కేంద్రానికి చెప్పారు.  ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదు. ఆ నిధులేమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ సిద్ధమని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ ప్రకటనను జగన్, మంత్రులు ఎందుకు ఖండించలేదు. కేసీఆర్ నుంచి నిధులు వచ్చినందునే ఏమీ చెప్పట్లేదు. సీఎఫ్ఎంఎస్ నుంచి ఆఫ్‌లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి. వాటిపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయం. రూ.లక్ష కోట్ల బిల్లులు చెల్లిస్తే.. రూ.20 వేల కోట్లు సజ్జల కాజేశారు. పోలవరం డ్యామ్‌ను పోలవరం బ్యారేజీగా మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని ఆరోపించారు.  

Updated Date - 2022-06-05T21:49:03+05:30 IST