రూ.500 కోట్ల అవినీతిని దాచేందుకే ACB దాడులు

ABN , First Publish Date - 2022-01-22T13:38:39+05:30 IST

పొంగల్‌ సరకుల కొనుగోళ్లులో చోటు చేసుకున్న రూ.500 కోట్ల అవినీతిపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తనపై ఏసీబీ దాడులు జరిగాయని అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌ వెల్లడించారు. దర్మపురిలో ఆయన

రూ.500 కోట్ల అవినీతిని దాచేందుకే ACB దాడులు

                           - మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌


చెన్నై: పొంగల్‌ సరకుల కొనుగోళ్లులో చోటు చేసుకున్న రూ.500 కోట్ల అవినీతిపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తనపై ఏసీబీ దాడులు జరిగాయని అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌ వెల్లడించారు. దర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎంకే  అధికారంలోకి వచ్చాక అన్ని శాఖల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవల నాసిరకం పొంగల్‌ కానుక సరకులు పంపిణీ చేసి అప్రతిష్ట పాలైందని విమర్శించారు. పొంగల్‌ సరకుల కొనుగోళ్లలో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని, దానిని మభ్యపుచ్చేందుకే తనపైన, తన కుటుంబీ కులపై ఏసీబీ దాడులను చేయించిందని, ఈ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని, చట్ట పరంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఈ దాడులలో తన ఇంటి నుంచి ఎలాంటి నగదు, నగలు పట్టుబడలేదని ఆయన చెప్పారు.

Updated Date - 2022-01-22T13:38:39+05:30 IST