రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2021-10-20T05:43:35+05:30 IST

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆలపాటి

మాజీమంత్రి ఆలపాటి 

కొల్లిపర, అక్టోబరు 19: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మంగళవారం మండలంలోని అన్నవరంగౌడపాలెం గ్రామంలో ఆయన పర్యటించి విద్యుత కోతల వలన, పెరిగిన విద్యుత ఛార్జీలపైన, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ  రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం వైసీపీ పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు చేయడంతో పాటు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. విద్యుత కొరత ఏర్పడటానికి  కారణం ప్రభుత్వం విద్యుత సంస్థలకు రూ.22వేల కోట్లు బకాయిలు ఉండడమేనన్నారు. ట్రూఆఫ్‌ ఛార్జీల పేరుతో  రూ.12వేల కోట్లు ప్రజలపై భారం మోపినట్లు చెప్పారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు భీమరపు చినకోటిరెడ్డి,  తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి  వంగా సాంబిరెడ్డి,  జిల్లా టీడీపీ నాయకుడు కంచర్ల అమృతరాజు, సర్పంచలు జోగేంద్రరావు, దొంతగాని శ్రీను, నాయకులు కొల్లి కోటిరెడ్డి, తాతా ఆంజనేయులు, ఉప్పాల సుబ్బారావు, తాతా శివయ్య  తదితరులు పాల్గొన్నారు.    

Updated Date - 2021-10-20T05:43:35+05:30 IST