వెళ్లి ఓ మూడు నెలలు రెస్ట్ తీసుకోవయ్యా బాబూ.. కోహ్లీకి వాన్ ఉచిత సలహా

ABN , First Publish Date - 2022-07-08T02:31:04+05:30 IST

102 టెస్టు మ్యాచ్‌లు. 8 వేల పరుగులు, అందులో 27 సెంచరీలు.. ఈ ఘనత మరెవరిదో కాదు. టీమిండియా మాజీ

వెళ్లి ఓ మూడు నెలలు రెస్ట్ తీసుకోవయ్యా బాబూ.. కోహ్లీకి వాన్ ఉచిత సలహా

న్యూఢిల్లీ: 102 టెస్టు మ్యాచ్‌లు. 8 వేల పరుగులు, అందులో 27 సెంచరీలు.. ఈ ఘనత మరెవరిదో కాదు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డు ఇది. క్రమం తప్పకుండా సెంచరీలు బాదుతూ వచ్చిన కోహ్లీ పరుగుల యంత్రంగా పేరుగాంచాడు. అలాంటి రన్ మెషీన్ ఇటీవల పరుగులు సాధించేందుకు చెమటోడ్చాల్సి వస్తోంది.


గత రెండేళ్లుగా కోహ్లీ పరిస్థితి మరింత దిగజారింది. మూడంకెల సంఖ్య చేరుకుని ఏళ్లు గడిచిపోతున్నాయి. 2019లో చివరిసారి బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించాడు. ఆ తర్వాతి నుంచి ఒక్కటంటే ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా అతడి ఖాతాలో లేదు. ఫలితంగా ఇంటాబయటా బోల్డన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 


కోహ్లీ తాజా ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు.  ఓ ఉచిత సలహా కూడా పడేశాడు. కోహ్లీ కనీసం ఓ మూడు నెలలు విశ్రాంతి తీసుకోవడం బెటరని పేర్కొన్నాడు. కుటుంబంతో అతడు తగినంత సమయం గడపాల్సిన అవసరం ఉందన్న వాన్.. ఐపీఎల్ తర్వాత లభించిన విశ్రాంతి సరిపోయినట్టు లేదని, కాబట్టి కనీసం మరో మూడు నెలలు విశ్రాంతి అవసరం అని తనకు అనిపిస్తోందని అన్నాడు. కాబట్టి బెంచ్‌కు పరిమితం కావాలని సూచించాడు. 20 ఏళ్ల కెరియర్‌లో మూడు నెలల బ్రేక్ వల్ల నష్టమేమీ జరగకపోగా మేలే చేస్తుందని వాన్ అభిప్రాయపడ్డాడు.  

Updated Date - 2022-07-08T02:31:04+05:30 IST