5వేల కుటుంబాలకు అండగా నిలబడుతున్న క్రికెటర్

ABN , First Publish Date - 2020-04-06T03:00:44+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో.. పని చేస్తేనే రోజుగడిచే పేదల బతుకులు దుర్భరం అయ్యాయి.

5వేల కుటుంబాలకు అండగా నిలబడుతున్న క్రికెటర్

జలంధర్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో.. పని చేస్తేనే రోజుగడిచే పేదల బతుకులు దుర్భరం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వారు ఆహారం కూడా అందక తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో తాను నివసిస్తున్న జలంధర్ ప్రాంతంలోని పేదలకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ అండగా నిలబడుతున్నాడు. స్థానికంగా ఉన్న 5వేల కుటుంబాలకు ఆహార పదార్థాలు పంచడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేశాడు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ పంజాబీ పేసర్ అండగా నిలబడటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కాగా, పంజాబ్ లో ఇప్పటివరకు 68 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-04-06T03:00:44+05:30 IST