Cm పదవిపై ఆశలేదు

ABN , First Publish Date - 2022-03-12T16:55:34+05:30 IST

మరోసారి ముఖ్యమంత్రి కావాలనే ఆశలేదని మాజీ సీఎం యడియూరప్ప పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశాన్ని ప్రస్తావించారు. యడియూరప్పను

Cm పదవిపై ఆశలేదు

                        - పార్టీ గెలుపు కోసం పనిచేస్తా: యడ్డీ


బెంగళూరు: మరోసారి ముఖ్యమంత్రి కావాలనే ఆశలేదని మాజీ సీఎం యడియూరప్ప పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశాన్ని ప్రస్తావించారు. యడియూరప్పను బలవంతంగా పదవి నుంచి తప్పించారనే  వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చారు. తనను ఎవరూ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించలేదన్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేశానన్నారు. మరోసారి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఏ మాత్రం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కొని బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన ఆశయమన్నారు. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో నాయకుడే లేరంటూ ఎద్దేవా చేశారు. బసవరాజ్‌ బొమ్మై బడ్జెట్‌ పట్ల ప్రజలకు వివరించేందుకు రాష్ట్రమంతా తిరుగుతామన్నారు. కర్ణాటకలోను కాంగ్రెస్‌ చిత్తు కావడమనేది అనుమానమే లేదన్నారు. మరోసారి ప్ర తిపక్షంలోనే కూర్చోవలసి ఉంటుందంటూ జోస్యం చెప్పారు.

Updated Date - 2022-03-12T16:55:34+05:30 IST