బెంగళూరు: రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చునని ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Leader of Opposition Siddaramaiah) అన్నారు. శుక్రవారం ఆయన ఒక ఇంగ్లీష్ చానల్‌తో మాట్లాడుతూ డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, ఎంబీ పాటిల్, దేశ్‌పాండే, పరమేశ్వర్, జమీర్ అహ్మద్ సీఎం రేసులో ఉన్నవారేనని, అదేమీ తప్పు కాదన్నారు. గెలుపొందిన ఎమ్మెల్యే(MLA)లు, అధిష్టానం తీర్మానమే అంతిమం కానుందన్నారు. సీఎం కావడం ఎవరి సొంత నిర్ణయం కాదని, ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే జరిగే ప్రక్రియ అన్నారు. తాను సీఎం అభ్యర్థి అనేది ముఖ్యం కాదని, ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయం కీలకం అవుతుందన్నారు. పదవిపై ఆశ ఉండడం సహజమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ స్థానాలలో గెలుపొందాక ఎమ్మెల్యేలు శాసనసభా పక్షనేతను ఎన్నుకుంటారన్నారు. ఆ తర్వాత అధిష్టానం సీఎం ఎవరనేది ప్రకటిస్తుందన్నారు. కాంగ్రెస్(Congress) లో ఇప్పటి వరకు సీఎం ఎవరనేది ప్రకటించలేదన్నా రు. ఇద్దరు అగ్రనేతలు తాము రేసులో ఉన్నామని చెప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి